Sep 05, 2010 - 02:54 AM - Unregistered? Register for a user account

Main Menu

Online
There are 80 unlogged users and 0 registered users online.

You can log-in or register for a user account here.

Telugu Folk Songs Aficionados

Reviews section

వేకువ హాయి - గోరట&#3

వేకువ హాయి - గోరటి వెంకన్న కంప కుంపటోలె కమ్మి అలుపె కాసింత కునుకుతో బలెహాయి గొలిపె సోయిలేని హాయి సూడసక్కని రేయి విని కనిపించని వింతగొంతుల జోలి సిరుగాలి పవనాల సినుకుమువ్వల లాలి మగత చూపుల కేళి మనస్సులూసుల తేలి ఉండిలేనట్టు ఊరించె వేకువ గాలి వేగుజాము గడిసె వెన్నెలెనుక నడిసె నింగి కొరుకొయ్యలు నీడతో జత కలిసె పిల్లగాలి పాటకే, పల్లె-మై మరిసె కలవరింతల అరెసె కాకమ్మనే మురిసె కలలోన తనకేమి కనిపించెనో కాకి తనలోనె తను నవ్వుకొని తడిసెనో భైరాగి అరుగేమో మరుగు బోదయి మోగె దర్గపై దట్టెమో పరవశంబుతొ నూగె గూటిలున్న కొంగ ఎగిరె పాల బుంగ వెండి రెక్కల నూపి ఏటితావుల నేగె వేకువతో ఆకలి మొదలాయెనో లేక ఊకెనె కొంగమ్మా ఊరిడిసెనో పులిసి పోయిన తవుడు లేసె బుడగల దవుడు కుడిసి నావు పొదుగు కుండలంత నురుగు మూగ పెదవుల అడుగు నాపె గుంజ తలుగు అరులు గుంజిన అరుపు కాపు మేని కుదుపు తలుగు నిప్పగ తల్లి వడి కేగెనా తడి పెదవులతొ లేగ తల ఊపెనా కులుకు తీగెలు గాలి మొలక నవ్వుల కూగె తను విరుసుకొని సెట్లు తలదువ్వు కొనసాగె మొగులు రేకుల జూసి మొగ్గలు సిగ్గొంది సిరు మబ్బు తెరలల్ల తొలి రేకులను విప్పె కునికె పిట్టల ముక్కు గందానికి గాలి పుప్పొడి అందమే తెచ్చెనా సిలక కొరికిన పండ్లు మురిపెంగ మాగించె వగరు తగ్గిన వనం గాలి తీపిని పెంచె ఏకుతార గొంతు ఆకలినె మరిపించె ముసుగు మోము యొక్క ముక్కెరనె మెరిపించె కలవరింతల పాట కనుసైగతో పరవసించీ వేకువెరుపెక్కెనే
[ All |  A |  B |  C |  D |  E |  F |  G |  H |  I |  J |  K |  L |  M |  N |  O |  P |  Q |  R ]
[ S |  T |  U |  V |  W |  X |  Y |  Z |  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  0 ]
10 most-popular reviews10 most-recent reviews
1) 1)
2) 2)
3) 3)
4) 4)
5) 5)
6) 6)
7) 7)
8) 8)
9) 9)
10) 10)
There are 0 Reviews in the database

Folk Talk

Copyright © 2006 www.TeluguFolkSongs.com Contact us at info(at)TeluguFolkSongs.com. Your feedback is greatly appreciated. Thanks to Shekar for images http://shekartoon.blogspot.com